ఒకప్పుడు నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేది.ఈ రెండు కుంటుంబాల హీరోలు కూడా అలానే ఉండేవారు.సినిమాలలో ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకునేవారు.ఈ రెండు ఫ్యామిలీలా ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే అర్థం చేసకొవాలి వీరి మధ్య గొడవలే ఏవిధాంగా ఉన్నాయో.కాని కాలక్రమేణా హీరోల మధ్య సన్నిహిత్యం పెరుగుతు వస్తుంది.
ఒకరి సినిమా ప్రారంభోత్సవానికి మరోకరు వెళ్లుతున్నారు.ఒకరి సినిమా హిట్ అయితే మరోకరు బహిరంగగానే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.ఈ రెండు కుటుంబాలకు చెందిన ఎన్టీఆర్-రాచరణ్‌లు కలిసి మెలిసి ఉంటు ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇక ఫ్యాన్స్ కూడా ఒక హీరో పుట్టిన రోజు వేడుకను మరో హీరో ఫ్యాన్స్ జరుపుకోవడం ఇక్కడ మరో విశేషం.ఎన్టీఆర్-రాచరణ్ ఇద్దరు కలిసి దర్శక ధీరుడు రాజమౌళి డైరక్షన్‌లో భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ పుట్టిన రోజున సందర్భంగా రాంచరణ్ భార్య ఉపాసన తన ట్వీట్టర్‌లో ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతు ఎన్టీఆర్-రాంచరణ్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.ఈ ఫొటో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. దీనికి కారణం అందులో ఇద్దరు స్టార్స్ ఎంతో అన్యోన్యంగా ఉండటమే. చరణ్ తారక్‌ను వెనుక నుంచి హత్తుకుని ఆటపట్టిస్తూ కనిపించారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా!! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి’ అని చరణ్ పోస్ట్ చేశారు. దీనికి అభిమానుల నుంచి తెగ రియాక్షన్స్ వచ్చాయి. ఫొటో అందంగా, చక్కగా ఉందని పేర్కొన్నారు.