- Advertisement -
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సిద్ధమవుతున్న జనతా గ్యారెజీ సినిమా షూటింగ్ గురువారం నుంచి చెన్పైలో ప్రారంభం కానుంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా, మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. మరాఠీలో ప్రముఖ నటుడైన సచిన్ కేడ్కర్ ఈ పినిమాలో విలన్ గా నటిస్తున్నారు.
గురువారం నుంచి జూన్ 2 వరకూ చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో జనతా గ్యారెజ్ షూటింగ్ జరుపుతారు. జూన్ 6 నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు హీరోయిన్లతో హీరో సాంగ్ ని షూట్ చేస్తారు.
ఇందుకోసం మూడు భారీ సెట్లు కూడా సిద్ధం చేశారు. జనతా గ్యారెజ్ లో ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తారని, ఆయన్ని చాలా కాలంగా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ చిత్రంలో చూపిస్తున్నామని చిత్ర దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు.