నాగార్జునతో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ వంటి సినిమాలు తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.. మళ్లీ నాగార్జున తో తీసిన మరో భక్తిరస చిత్ర్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం..
కథ :
రామ్ (నాగార్జున) ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి దేవుడిని చుడాలనే కోరికతో తిరుమలలోని పద్మానంద స్వామి (సాయి కుమార్) అనే గురువు వద్దకు విద్యనభ్యసించి.. దేవుడి కోసం తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ అప్పుడు వచ్చింది దేవుడు అని గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని.. దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల దేవుడి దగ్గరకు వెళ్ళాలేకపోతాడు. ఆ క్రమంలోనే మరో వెంకటేశ్వర సామి భక్తురాలు కృష్ణమ్మ (అనుష్క) ను కలిసి తిరుమల క్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుని, క్షేత్రాన్ని వైకుంఠంగా అభివృద్ధి చేస్తూంటాడు. అతని భక్తికి, పని తననానికి ముగ్దుడైన స్వామి మరోసారి అతనికి దగ్గరై అత్యంత ఆప్తుడిగా మారిపోతాడు. కాని కొందరూ చెడ్డవారు.. రామ్ ను అక్కడి నుండి పంపించాలని ప్రయత్నిస్తారు. ఆ దుర్మార్గులు ఎవరు? చివరికి అతని భక్తి అతడ్ని ఎక్కడకు చేర్చింది..? అనేది ఈ మూవీ స్టోరీ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్ ల అద్భుతమైన నటన గురించి. ఈ మూవీతో నాగార్జున మరోసారి ‘అన్నమయ్య’ సినిమాని గుర్తు చేశారు. నాగార్జున నటన సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్ కి జీవం పోసింది. భక్తి భావం, మాటల్లో ఆర్ద్రత, నడవడికలో క్రమశిక్షణ ఇలా ప్రతి ఒక్కటి అందరిని ఆకట్టుకుంటాయి. హీరోలా కాకుండా పరమ భక్తుడిగానే కనిపించారు నాగ్. ఇక వేంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్ రాజ్ జైన్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు మరోసారి తన దర్శకత్వానికి తిరుగులేదని నిరూపించారు. మొదటి భాగమంతా నాగార్జున జీవితం మీద, అతను తిరుమల చేరుకొని, ఆ క్షేత్రాన్ని బాగు చేయడం మీద నడిపి ఆకట్టుకుని ద్వితీయ భాగం మొత్తం దేవుడికి, భక్తుడికి మధ్యన గల హద్దులులేని భక్తి, ఆదరణ అనే అనుబంధాల్ని చాలా భావోద్వేగంగా ఆవిష్కరించి మైమరపింపజేశారు. రామ్ హాతిరామ్ బావాజిగా మారడం, భక్తుడే దేవుడికన్నా గొప్పవాడు అని చెప్పే అంశం, తన ప్రియమైన భక్తుడి కోసం దేవుడంతటివాడు వేదన చెందడం లాంటి సందర్భాలు మనసును కదిలించాయి. కీరవాణి భక్తి పాటలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ ల మధ్య తెరకెక్కించిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడా రాఘవేంద్రరావు మార్క్ తో చూడటాని బాగుంది. ఎస్. గోపాల్ సినిమాటోగ్రఫీ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ భక్తిరస సినిమాలో మైనస్ అంటే కృష్ణమ్మ (అనుష్క) ఎపిసోడ్. అలాగే జగపతి బాబు పాత్ర కూడా అనుకున్నంత లేదు. ఫస్టాఫ్ లో వచ్చే రావు రమేష్ పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సీన్స్ కొంచెం రొటిన్ గా ఉన్నాయి. అక్కడ అక్కడ కథనం నెమ్మదిగా సాగింది.
మొత్తంగా :
ఈ సినిమాతో మరోసారి రాఘవేంద్రరావుగారు ప్రేక్షకుల్లోని భక్తి భావాన్ని తట్టి లేపారు. రాఘవేంద్రరావుగారి టేకింగ్… మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, నాగార్జున, సౌరబ్ ల అద్భుతమైన నటన, భక్తి భావాన్ని తట్టి లేపే సీన్స్.. క్లైమాక్స్.. సూపర్బ్ సినిమాటోగ్రఫీ, వినదగిన పాటలు.. ఇందులో ప్లస్ గా చెప్పొచ్చు. కాస్త రొటీన్ గా అనిపించిన ఫస్ట్ ఆఫ్ సీన్స్.. సెకండ్ ఆఫ్ లో అనుష్క ఎపిసోడ్ బలహీనంగా ఉండటం మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా వేంకటేశ్వర స్వామి భక్తులనేగాక.. ఇతర ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.
{youtube}v=GmkLcsHg0Rk{/youtube}