యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరతో పాటు బుల్లితెరను కూడా ఏలుదాం అని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. సినిమాలతో పాటు బుల్లితెరకు సంబంధించిన షోలతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు. రియాల్టీ షో బిగ్‌బాస్‌కు యాంకరింగ్ చేసి తాను వెండితెర మీదనే కాదు బుల్లితెరలో కూడా తాను కింగ్‌నని నిరుపించుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ భారీ డీల్ సెట్ చేశాడు. ప్రముఖ శీతల పానియాల సంస్థ ‘పార్లే ఆగ్రో ఎన్టీఆర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. పార్లే ఆగ్రో ఉత్పత్తుల్లో ఒకటైన ‘యాప్పి ఫిజ్’ పానియం యాడ్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.
సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తానికి ప్రచారకర్తగా వ్యవహరించడానికిగాను ఈ సంస్థతో ఎన్టీఆర్ ఎన్నేళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. దీనికిగానే ఎన్టీఆర్ సదరు సంస్థతో భారీగానే పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌కు పారితోషకం ఎంత ఇస్తున్నారో అనేది మాత్రం బయటికి చెప్పలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. బిగ్‌బాస్ మూడో సీజన్‌కు ఎన్టీఆర్ యాంకరింగ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.దీనిపై ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
- Advertisement -
బ్రాండ్ అంబాసిండర్‌గా భారీ డీల్ కుదుర్చుకున్న ఎన్టీఆర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -