మెగా ఫ్యామిలీకి ఈ సంవత్సరం మొదట్లో కూడా కలిసి రాలేదు. గత సంవత్సరం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా 2018 సంవత్సరంలోనే అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దాదాపు 75 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాతలకు 45 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. అజ్ఞాతవాసి సినిమా దెబ్బకు పవన్ సినిమాలు మానేసి రాజకీయాలలోకి బిజీ అయ్యాడు.
ఇక ఈ సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీకి నిరాశే ఎదురైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా మొదటి రోజునే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్ బిల్డప్ తప్ప సినిమాలో ఏమి లేదని ప్రేక్షకులు తెల్చేశారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం సినిమాను చూసి తిట్టుకుంటున్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవాలి.
ఈ సినిమా కూడా నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సెలవలు పూర్తి కాగానే ఈ సినిమా పూర్తి కలెక్షన్లు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి గత సంవత్సరం సంక్రాంతి బాబాయ్‌కు , ఈ సంవత్సరం అబ్బాయ్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. దీంతో మెగా అభిమానులు సంక్రాంతికి మెగా సినిమాలు విడుదల చేయకుండా ఉంటేనే మంచింది అనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’