పవన్ చేసిన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ అయిన తర్వాత సినిమాలకు గుడ్‌బాయ్ పెప్పారు పవన్. సినిమా చేసేసమయంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం.
పవన్ సూచనల మేరకు విజయ్ నటించిన తెరి చిత్రం ఆధారంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొత్త కథనంతో స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఈ సినిమాకి సంతోష శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని నిన్నమొన్నటివరకూ వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందుగా పవన్ ఈ సినిమా చేయనున్నాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం సంతోశ్ శ్రీనివాస్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడని చెప్పుకున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది. అప్పటికే పోలీసోడు అంటూ ఆ సినిమా తెలుగులో వచ్చేసినా.. కేవలం 40 రోజుల కాల్షీట్స్ తో భారీగా రెమ్యూనరేషన్ ముట్టచెప్పేలా.. పవన్ ఈ చిత్రం చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు తను సినిమా చేయడం సాధ్యం కాదని తేల్చేశాడట పవర్ స్టార్. సంతోష్ శ్రీనివాస్ వేరే హీరోతో తన తర్వాతి సినిమాను రూపొందించడంపై అభ్యంతరాలు లేవని కూడా తేల్చేశాడట. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా తను తీసుకున్న అడ్వాన్స్ ను త్వరలోనే తిరిగిచ్చేస్తానని చెప్పాడట పవన్ కళ్యాణ్.