Tuesday, May 6, 2025
- Advertisement -

కొత్త లుక్‍లో పవన్ కళ్యాణ్..

- Advertisement -

సినిమా షూటింగ్స్.. మరో పక్క రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తూనే.. సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదయ సీతం తెలుగు రీమేక్ కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఓజీ(ఒరిజినల్‌ గ్యాంగ్ స్టర్‌) అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా సెట్స్ మీదకొచ్చేశారు.

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ ఉంటుందని సమాచారం. సాహో లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకున్న సుజీత్‌ చేస్తున్న సినిమా కావడంతో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంతా ఫిక్సయ్యారు. అంతే కాదు పవన్ కు సుజీత్‌ వీరాభిమాని కూడా.

అయితే నిన్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్‌ కొత్త లుక్ లో కనిపించారు. బ్లాక్ షేడ్స్ పెట్టుకుని బ్లాక్ హుడీ, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరించి ఆల్ బ్లాక్ లుక్‌లో కనిపించి పవర్ స్టార్ అభిమానులను ఫిదా చేశారు. అ పోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ’పవన్ వింటేల్ లుక్’ అంటూ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -