- Advertisement -
దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతిని డైరెక్టర్స్ డేగా నిర్ణయించడం చాలా సంతోషకరమని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పేపర్ ప్రకటన విడుదల చేశారు.దాసరి దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచారని ,సినిమా రంగం అంతా ఒక కుటుంబమేనని దాసరి అనేవారు,మన ఇంటి సమస్యను మనమే పరిష్కరించుకోవాలన్నారు.
దాసరి నారాయణ రావు జయంతిని అందరూ చిరకాలం గుర్తు పెట్టుకునేలా నిర్ణయించిన దర్శకుల సంఘానికి, ఇందుకు చొరవ చూపిన ఆ సంఘం అధ్యక్షుడు శంకర్‌కి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.