టాలీవుడ్ తాజా సంచలనం శ్రీరెడ్డి ఇష్యూపై జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు.ఇండస్ట్రీలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని, కోర్టుకు వెళ్లాలని అంతేకాని టీవి ప్రోగ్రామ్‌లో పొల్గోంటే మీకు ఏం వస్తుందని ఆయన ప్రశ్నించారు.న్యాయ పరంగా వెళ్తేనే వారికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
మీరు ఇలా పొరాటం చేస్తే కొన్ని రోజులకి అందరు మర్చిపోతారని న్యూస్ చానెల్‌కు సెన్సేషన్ కావలని వారికి మరి సెన్సేషన్ వార్త వస్తే మిమ్మల్ని మర్చిపోతారని ఇది సరైనా మార్గం కాదని పవన్ అన్నారు.పోరాడే వారు సెన్సేషన్ కోసం కాకుండా, న్యాయం కోసం పోరాటం చేయాలని చెప్పారు. వారికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని అవసరం అయితే వారి కొసం తను కూడా పోరాటం చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.