Tuesday, May 6, 2025
- Advertisement -

సర్దార్ సెట్ అంటే మాటాల? అందుకే అన్ని కోట్లు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాజల హీరోయిన్ గా తెరకేక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా పవన్ ఫ్రేంఢ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా యూనిట్ గుజరాత్ లో ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ చేరుకుంది.

జనవరి  5 న హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ కొన్ని ముఖ్యమైన  సీన్స్ , పవన్ కళ్యాణ్ – కాజల్ తో పాటలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ కోసం పెద్ద మెత్తంలో రూ.4.5 కోట్ల ఖర్చుపెడుతున్నారు. 2016 లో సమ్మర్ లో రిలీజ్ చేయడానికిప్లాన్ చేస్తున్నారు.

అభిమానులోను ఇటు సినీ పరిశ్రమలోను ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోను గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉంటుందని దర్శకనిర్మాతలు చేబుతున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -