జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మిత్రుడు అలీ గురించి మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో అలీ, పవన్ కల్యాణ్‌లు స్నేహితులుగా కొనసాగుతున్నారు. పవన్ కల్యాణ్ నటించే ప్రతి సినిమాలో అలీ కూడా నటిస్తుంటాడు. అలీ లేకపోతే నాకు సినిమాలు చేయబుద్ధి కాదని బహిరంగంగానే చెప్పాడు పవన్ కల్యాణ్. అయితే స్నేహం వేరు రాజకీయాలు వేరని నిరుపించారు వీరిద్దరు. అలీ తన స్నేహితుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీలో చేరకుండా వైఎస్ఆర్‌సీపీలో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది.
తాజాగా అలీ వైసీపీలో చేరడంపై స్పందించారు పవన్ కల్యాణ్. ఏ పార్టీలోనైనా చేరే అవకాశం అలీకి ఉందని, వైసీపీ అధినేత జగన్ కు ఎక్కువ బలం ఉందనే నమ్మకంతో అలీ ఆ పార్టీలోకి వెళ్లాడని అన్నారు. . అది అలీ వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. అలీని నేను పార్టీలో చేరమని ఆహ్యానించలేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అలీ వేరే పార్టీలో చేరినప్పటికి తనకు ఆత్మీయుడేనని చెప్పుకొచ్చారు పవన్. అలీ మొదట టీడీపీలో కాని, జనసేనలో కాని చేరతారనే ప్రచారం జరిగింది. కాని అలీ అనుహ్యాంగా వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని, ఆ పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
- Advertisement -
జగన్‌కు బలం ఉందనుకుని అలీ వైసీపీలో చేరారనుకుంటా – పవన్ కల్యాణ్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -