Monday, May 5, 2025
- Advertisement -

గుజరాత్‌ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్!

- Advertisement -

ఎప్పటినుంచే ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకి శుభవార్తే అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా షూటింగ్‌కి దూరంగా ఉన్నాడు. చాలా గ్యాప్ తర్వాత పవన్ మేకప్‌కి రెడీ అవుతున్నారని సమాచారం. పవన్‌కి చాలా దగ్గరగా, సన్నిహితంగా ఉండే శరత్‌పవార్ నిర్మాతగా పవర్ సినిమా దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో వస్తున్న గబ్బర్‌సింగ్‌2 మూవీ ఇప్పుడు రెండో షెడ్యూల్ కి చేరుకుంది. 

ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులైంది. అయినా పవన్‌ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశామని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. రెండో షెడ్యూల్ గుజరాత్‌లో ఈ నెలాఖరు నుండి జరుగుతుందని సమాచారం. 

ఈ షెడ్యూల్‌లో పవన్ ఇప్పుడున్న గడ్డంతో ప్లాష్‌బ్యాక్ సన్నివేశాలలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి గబ్బర్‌సింగ్‌2 టైటిల్ కాకుండా ’సర్దార్’ అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -