టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, పోలీసు కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
మే 13న జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా రాంగ్ రూట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు హీరో బెల్లంకొండ. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వాహనాన్ని ఆపి హెచ్చరించగా, ఆయన ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళ్లేందుకు యత్నించారు.
ఈ వీడియో ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. హీరో తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కానిస్టేబుల్ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.