సినిమాతో రాని క్రేజ్ ఒక్క సాంగ్‌తో వచ్చేసింది.హీరోయిన్ పూజ హెగ్డె గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా హిట్ కాలేదు.దీంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది.అక్కడ హృతిక్ రోషన్‌తో సినిమా చేసినప్పటికి అక్కడ కూడ ఈ భామకు నిరాశే ఎదురైంది.దీంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది.అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథ్ సినిమాలో కనిపించి మెప్పించింది.ఇక ఈ సినిమాలో అందాల ఆరబోసి, బికినిలో కూడా దర్శనం ఇచ్చింది.దీంతొ ఆమెకు వరస సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.ఇప్పటికే మహేశ్ బాబు,ఎన్టీఆర్ సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తుంది పూజ.
తాజాగా ఆమె మరో క్రేజీ ప్రొజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు మన డార్లింగ్ ప్రభాస్.ఈ సినిమా తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో.ఈ సినిమా తరువాత జిల్ ఫేం రాధకృష్ణతో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఈ సినిమాలో పూజ హెగ్డె హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం.ఇప్పటికే ఎన్టీఆర్,మహేశ్‌లతో సినిమాలు చేస్తున్న పూజ ఇప్పుడు ప్రభాస్‌తో కూడా ఛాన్స్ కొట్టేసింది.ఇది కనుక నిజం అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పూజ హెగ్డె ఉండటం ఖాయం.