ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్’ చూసిన ప్రతి ఒక్కరూ…. పార్ట్ 2 ‘బాహుబలి-ది కంక్లూజన్’ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక బాహుబలి 2 సినిమాని ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు ప్రభాస్ సంబంధించిన ఈ వార్త అందరిని సంతోష పెడుతుంది. ప్రభాస్ తన ఇంట్లో పని చేస్తున్న యువతి వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రభాస్ స్వయంగా పెళ్లికి హాజరై ఆశీర్వదించేంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్చ పోతున్నారు.
ఆ వివాహ వేడుకలో కాసేపు అక్కడే కూర్చుని చాలామందితో కబుర్లు కూడా చెప్పాడు ప్రభాస్. అక్కడి అభిమానులు ప్రభాస్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ పై ఉన్న గౌరవం మరింత పెరిగిందని అంటున్నారు అభిమానులు.