Saturday, April 20, 2024
- Advertisement -

ఇస్రో బాహుబ‌లి చంద్ర‌యాన్ 2పై రీల్ బాహుబ‌లి ప్ర‌భాస్ ఏమ‌న్నారంటే…?

- Advertisement -

అంత‌రిక్షంలో భార‌త్ స‌త్తాను మ‌రో సారి చాటింది ఇస్రో. చంద్రయాన్-2ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్ర‌వేశ పెట్టింది. భారీ సైజులో ఉండే జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను అంతరిక్షంలోని మోసుకెళ్లింది. ఈ రాకెట్ భారీ సైజులో ఉండటంతో అందరూ దీన్ని ముద్దుగా ‘బాహుబలి’ అని పిలుస్తున్నారు.

అనంత‌రం చంద్ర‌యాన్ 2పై బాహుబ‌లి ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.హ‌లో డార్లింగ్స్‌, చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం విజ‌య‌వంతంగా కావడం ప‌ట్ల యావ‌త్ భారతీయులు గ‌ర్వ‌ప‌డుతున్నారు. చంద్ర‌యాన్2ను క్ష‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టిన వాహ‌కానికి బాహుబ‌లి అనే పేరు పెట్టడం గౌర‌వంగా భావిస్తున్నాను. 300 వంద‌ల ట‌న్నుల బ‌రువైన చంద్ర‌యాన్ 2ను ప్ర‌యోగించ‌డం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది“ అన్నారు.

ఇప్పుడు భారత చరిత్రలో చంద్రయాన్ 2 అంత గొప్ప చరిత్ర సృష్టించించిదని ప్రభాస్ పేర్కొన్నారు. బాహుబలి చిత్ర యూనిట్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఇస్రో శాస్త్రవేత్తలకు థాంక్స్ చెబుతూ, చంద్రయాన్ 2 వాహకానికి తమ సినిమా పేరు పెట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నామని తెలియజేశారు.

https://www.instagram.com/p/B0NsgoVHzMp/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -