Sunday, May 4, 2025
- Advertisement -

అదరగొట్టే విజువల్స్ తో సాహో టీజర్

- Advertisement -

ప్రభాస్ అభిమానులు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సాహో’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సాహో’ మేకింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో శ్రద్ధ కపూర్ బాధ అయినా సంతోషమైనా తనకు పంచుకోవడానికి ఎవరు లేరు అని చెప్పడంతో మొదలవగా ప్రభాస్ నేనున్నాను అని అంటాడు. అనుకున్న విధంగానే టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు.

హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోకుండా అదిరిపోయే విజువల్స్ ను అందించారు. ప్రభాస్ ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తాడని చెప్పుకోవచ్చు. ఇక విలన్ లను తన డై హార్డ్ సాంగ్స్ అని ప్రభాస్ చెప్పడం చూస్తుంటే సినిమాలో కామెడీ యాంగిల్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘సాహో’ టీజర్ అంచనాలను మించి మించిపోయిందని చెప్పుకోవచ్చు. టీజర్ తోనే భారీగా అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -