Sunday, May 4, 2025
- Advertisement -

ప్రకాష్ రాజ్ చెబుతున్న ‘రామాయణం’

- Advertisement -

ప్రకాశ్ రాజ్ మంచి నటుడే కాదు .. అభిరుచిగల దర్శకుడు కూడా. తాజాగా తెలుగులో ఒక సినిమాను తెరకెక్కించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ‘మన ఊరి రామాయణం’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా పోస్టర్ ను ఆయన తన ఫేస్ బుక్ ద్వారా ఆవిష్కరించాడు.

బహుభాషా నటుడిగా .. విలక్షణమైన నటుడిగా ప్రకాశ్ రాజ్ కి మంచి క్రేజ్ వుంది. నటుడిగా ఎప్ప్పుడూ బిజీగా వుండే ప్రకాశ్ రాజ్, తీరిక చేసుకుని మరీ, తనకి నచ్చిన కథలను తెరకెక్కిస్తూ వుంటాడు. ధోని .. ఉలవచారు – బిర్యాని సినిమాలు అలా వచ్చినవే. ఇక తాజాగా ఆయన తెలుగు .. కన్నడ భాషల్లో ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇది ఒక గ్రామానికి సంబంధించిన కథ అనీ ..పూర్తి వినోదభరితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ దర్శక నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చనున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -