Tuesday, May 6, 2025
- Advertisement -

గ‌రుడ‌వేగ ద‌ర్శ‌కుడితో ఎన‌ర్జిటిక్ హీరో

- Advertisement -

సీనియర్‌ హీరో రాజశేఖర్‌కు పీఎస్‌వీ గరుడవేగ సినిమాతో అద్భుత‌మైన విజ‌యం అందించాడు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తీసిన సినిమాల‌న్నీ ప్ర‌త్యేక‌మైనవి కావ‌డంతో రాజ‌శేఖ‌ర్ అవ‌కాశం ఇచ్చాడు. ఆ అవ‌కాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా స‌ద్వినియోగం చేసుకొని మంచి సినిమా ప్రేక్ష‌కుల‌కు అందించాడు. ఈ సినిమా అంద‌రీ మ‌న్న‌న‌లు అందుకుంది. ఇప్పుడు అత‌డు మరో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

నితిన్ హీరోగా ప్రవీణ్ సినిమా చేస్తున్న‌ట్టు వ‌చ్చిన‌ వార్తలు పుకార్లుగా మారాయి. అయితే ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో విజ‌యం అందుకున్న రామ్‌ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం‍లో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తాడ‌ని తెలుస్తోంది. భవ్య క్రియేషన్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -