- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులలో భాగంగా 2014 జూన్ రెండవ తేదీ నుండి 2023 డిసెంబర్ 31 తేదీ మధ్యలో నిర్మించిన చిత్రాలలో ప్రతి సంవత్సరానికి ఒక చిత్రానికి ఉత్తమ చలనచిత్ర అవార్డును అందించనున్నట్టు తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు తెలిపారు.
2014 నుండి 2023 వరకు గత ప్రభుత్వం ఫిలిం అవార్డులను ప్రకటించలేదని, ఈ నేపథ్యంలో ఈ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలనచిత్రానికి అవార్డును అందించాలని నిర్ణయించినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ 2014 నుండి 2023 వరకు ప్రతీ ఏటా ఇచ్చే ఫిలిం అవార్డులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయిస్తుందని, కమిటీ నిర్ణయించే సినిమాలను ప్రభుత్వానికి ఆమోదనిమిత్తం పంపడం జరుగుతుందని అయన వివరించారు.