ఎనర్జిటిక్ నటనతో సినిమాలు చేస్తున్న నటుడు రామ్ పోతినేని. ‘ఉన్నది ఒకటి జిందగీ’ తర్వాత సినిమాల జోరు పెంచాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంకో సినిమా ప్రవీణ్ సత్తార్‌తో చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఇరకాటంలో పడిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మిస్తామని చెప్పిన నిర్మాత హ్యాండిచ్చాడు.
‘గరుడవేగ’తో సత్తా చాటుకున్న ప్రవీణ్ సత్తార్ ఇప్పుడు రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఎక్కువ భాగం యూరప్‌లో షూట్ చేయాలంట. ఈ సినిమాను ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్‌లో నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తానని చెప్పాడు. దీంతో ఏర్పాట్లు చేసుకుంటున్న దర్శకుడికి ఆనంద్ ప్రసాద్ షాకిచ్చాడు. మీ సినిమా చేయలేను అని చెప్పాడంట. ఎందుకంటే ఓవర్ బడ్జెట్ అయ్యిందని సమాచారం. బడ్జెట్ రామ్ మార్కెట్ స్థాయికి మించి చాలా అవుతుందని తేలడంతో ఆనంద్ ప్రసాద్ తప్పుకున్నారు అని తెలుస్తోంది.
అయితే నిర్మాత హ్యాండివ్వడంతో మరో నిర్మాత కోసం ప్రవీణ్, రామ్ వేట ప్రారంభించారు. కొన్నాళ్ల వరకు ప్రయత్నాలు చేసి చివరకు ఎవరూ ముందుకు రాకుంటే రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్‌తో చేసే అవకాశం ఉంది.