- Advertisement -
మహేష్ బాబుతో సినిమాకు సంబంధించిన ఫస్ట్ అప్‌డేట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. సోషల్ మీడియా వేదికగా ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్ చేసి కనుగొనడం కోసం తిరుగుతున్నా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి అని ఇటీవల జక్కన్న హింట్ ఇవ్వగా పక్కన జంతువుల గుంపు కనిపిస్తోండటం విశేషం.
ఎట్టకేలకు మహేష్‌తో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రావడం ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపింది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోండగా దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.