Saturday, April 20, 2024
- Advertisement -

ఏర్పాట్లు మొదలవుతున్నాయి.. ప్ర‌జ‌ల‌కు, అభిమానుల‌కు పండగే…

- Advertisement -

సూపర్ స్టార్ రజినీ ముఖ్యమంత్రి అవ్వటానికి రంగం సిద్దమవుతోందట. త్వ‌ర‌లోనె ఆయ‌న సీఎం కాబోతున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండానే, ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందకుండానే ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నదే సందేహంగా ఉందా…. అయితే ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యేది తెర‌మీద‌.

ఇప్ప‌టికే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చిన సూప‌ర్‌స్టార్‌…సినిమాలో సీఎంగా న‌టించ‌బోతున్నారు.రియ‌ల్ సీఎం ఎలా ఉండాలో దీంతో చూపించ‌నున్నారు.సిల్వ‌ర్ స్క్రిన్‌పై మాత్రం సూపర్‌స్టార్‌ని సీఎంగా చూపించేందుకు దర్శకుడు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తన సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘ముదల్వన్‌’ (ముఖ్యమంత్రి అని అర్థం, తెలుగులో ఒకే ఒక్కడు)కి సీక్వెల్‌ తీసే యోచనలో శంకర్‌ ఉన్నారట. అందులో రజనీకాంత్‌ని నటింపజేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం

ఇలాంటి సినిమా ఒక అవసరమే ఎటూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్న రజినీకి ఇప్పుడు ఇలాంటి సినిమా ఒకఅవసరమే అనుకోవచ్చు. ప్రస్తుతం ‘ముదల్వన్‌’ సీక్వెల్‌కి స్రిప్టు పనులు జరుగుతున్నా యని, అది కూడా ‘బాహుబలి’ రైట‌ర్ విజయేంద్ర ప్రసాదే స్టోరీ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్క్రీన్‌పై ‘సీఎం’గా మారతారేమో అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ఈ సినిమా మాంచి హెల్ప‌వుతుంద‌ని, ఈ మూవీలో ర‌జినీ పొలిటిక‌ల్ డైలాగ్స్ త‌మిళ‌నాట మారుమోగిపోవ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది.

రజినీ తెరమీదనే కాదు బయట కూదా సీయెం అవ్వాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయటం వల్ల లాభమే అనుకుంటున్నట్టున్నాడు. ఇక శంకర్ తల్చుకుంటే ఆపాత్రని ఎంత బలంగా మలచగలడో తెలిసిందే. అంటే ఈ సినిమా ద్వారా రజినీ సీయెం అయితే ఎలా ఉంటుందీ అన్నది ముందే జనానికి చెప్పే ప్ర‌య‌త్న‌మ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -