మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన ఆరోపణలు ఒక మహిళ…సాటి మహిళపై చేయడం బాధాకరం అని చెప్పుకొచ్చారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ మహిళ ఈ రకంగా మాట్లాడటం బాధేస్తుందని చెప్పుకొచ్చారు.
గౌరవంగా ఉండాలనే నేను మౌనంగా ఉంటున్నాను కానీ అది నా బలహీనత కాదని గుర్తుంచుకోవాలన్నారు రకుల్. రాజకీయ పార్టీలకు నేను వ్యతిరేకం… నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు అన్నారు. రాజకీయ మైలేజ్ కోసం నా పేరును దురుద్దేశపూర్వకంగా ఉపయోగించారని ఇకపై మానేయాలన్నారు.
మంత్రి కొండా సురేఖపై నటుడు విజయ్ దేవరకొండ పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద, రాజకీయ నాయకుల మీద నా అభిప్రాయాన్ని ఆమోదయోగ్యమైన భాషలో వ్యక్తీకరించేందుకు ఇబ్బంది పడుతున్నాను అని చెప్పారు.
రాజకీయ నాయకులకు మేము ఓట్లు వేసేది వారు మాకు మౌలిక సదుపాయాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, మెరుగైన విద్యను అందించి మేము ఎదిగేందుకు సహకరిస్తారని..ప్రజలుగా మేము ఇలాంటి వివాదాలను అంగీకరించలేమన్నారు. రాజకీయాలు ఇంతకన్నా దిగజారలేవు అని తెలిపారు విజయ్.