తెలుగులో అవకాశాలు లేక బాధపడుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఓ మంచి అవకాశం వచ్చినట్టే కనిపిస్తోంది. తెలుగులో అవకాశం లేక బాలీవుడ్‌కు వెళ్లిన రకుల్‌కు తెలుగులో ఓ మంచి అవకాశం వచ్చిందని తెలుస్తోంది. నాగార్జున, నాని ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్‌కు ఓ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో నాని సరసన ఆమె నటించబోతున్నట్లు సమాచారం.
దర్శక, నిర్మాతలు రకుల్‌కు కథ చెప్పడంతో బాగా నచ్చిందట. వెంటనే సినిమాలో నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌లో ‘అయ్యారి’ సినిమా చేస్తోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో రకుల్ నటించిన ఈ సినిమా త్వరలో విడుదలవనుంది. దీంతో పాటు కోలీవుడ్‌లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య 36వ సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. మహేశ్‌బాబు-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో కూడా చేస్తున్నట్లు సమాచారం.