Monday, May 5, 2025
- Advertisement -

బ్రూస్ లీ డ్యామేజ్ తగ్గించే ప్రయత్నం మొదలైంది

- Advertisement -

మెగా కాంపౌండే కాదు…. శ్రీనువైట్ల కూడా తెలివైనవాడే. బ్రూస్ లీ చిత్రానికి సంబందించిన టీజర్ల విషయంలో మార్కెట్లో వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ ను కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు.

దానిలో భాగంగా ఆపరేషన్ డ్యామేజ్ కంట్రోల్ ను షురూ చేసేశాడు. ఇప్పటి వరకూ వచ్చిర రెండు టీజర్లలో ఒకటి యాక్షన్ ,రెండు ఫ్యామిలీ టీజర్ మాత్రమే కనిపించాయి. అయితే శ్రీనువైట్ల తరహా కామెడీ టీజర్ ఇప్పటి వరకూ కనపడలేదు. అంటే ఈసినిమాలో కామెడీ ట్రాక్  లేనే లేదా అంటూ రకరకాల ఊహాగానాలు తలెత్తాయి. ఏమో అయ్యుండొచ్చంటూ రూమర్లకు ఊతం పెరిగింది.

ఇంకా లేట్ చేస్తే కరెక్ట్ కాదని శ్రీనువైట్ల మెగా సందేశంతో త్వరలో కామెడీ టీజర్ ను మార్కెట్లోకి వదిలి డ్యామేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగైనా ఈరూమర్లకు చెక్ పెట్టినట్లవుతుంది కదా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -