మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు చరణ్. అయితే ఇప్పుడు తాజాగా చెఫ్ అవతారం ఎత్తారు.
ఇది ఏ సినిమా కోసమో కాదులెండి.. తన భార్య కోసం. రంగస్థలం ప్రచార పనులు కూడా దాదాపు పూర్తి అవుతుండటంతో ఇప్పుడు ఇంట్లో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు చరణ్.అందులో భాగంగా భార్య కోసం వండిపెడుతూ ఇలా షెఫ్ అవతారమెత్తాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది చరణ్ భార్య ఉపాసన.
చరణ్‌ను మాస్టర్ షెఫ్‌గా అభివర్ణిస్తూ, తను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ వండుతున్నాడంటూ ఉపాసన పేర్కొంది. భర్తను అండోరబుల్ హజ్బెండ్‌గా పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది ఉపాసన.
Master Chef 🍳👨🍳 #MrC cooking healthy breakfast for us post his workout. 🏋🏻♂️#adorablehusband ❤😘 #ramcharan pic.twitter.com/YCp8bZ6Vt2
— Upasana Kamineni (@upasanakonidela) April 18, 2018