మెగా హీరోలందరు ఒకచోట కలిస్తే అభిమానులకు పండగే. ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని ఫ్యాన్ బేస్ మెగా ఫ్యామిలీకి ఉంది. మెగా హీరోల మీద అభిమానులు తమ ప్రేమను ఎప్పటికప్పుడు చాటుకుంటునే ఉన్నారు. తాజాగా మెగా హీరోలిద్దరు కలిసి ఓ చోట చేరారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు కలిసి ఓ ఫ్రేమ్‌లో కనిపించారు. అన్నదమ్ములిద్దరూ ఓ మంచి ట్రిప్ వేశారు. రామ్ చరణ్ – వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఇచ్చిన సెల్ఫీ ఇప్పుడు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.
ఈ ఫోటోలో ఇద్దరు హీరోలు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRRలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోమరం భీంగా కనిపించునున్నాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరు ఇలా రెండు డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో మెగా అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -
మెగా సెల్ఫీ అదిరింది..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -