రంగస్థలం వంటి హిట్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్,సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా నుంచి రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. చరణ్ గుర్రం మీద కూర్చోని స్వారీ చేస్తు ఈ పోస్టర్‌లో కనిపించాడు. ఈ కొత్త పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చరణ్ గుర్రం ఎక్కితే సినిమా హిట్ అంటున్నారు మెగా అభిమానులు.
గతంలో రామ్ చరణ్ మగధీర, నాయక్ సినిమాలలో గుర్రపు స్వారీతో ప్రేక్షకులను అలరించాడు. ఆ రెండు సినిమాలు ఎంతటి విజయం సాధించాయో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ గుర్రం ఎక్కడంతో ఈ సినిమా కూడా ఘన విజయం సాధించిడం ఖాయం అంటున్నారు మెగా అభిమానులు. ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు(గురువారం) హైదరాబాద్‌లో జరగనుంది. సినిమా ట్రైలర్‌ను కూడా ఈ రోజే విడుదల చేయనున్నారు..
- Advertisement -
రామ్ చరణ్ గుర్రాన్నిసెంటిమెంట్‌గా భావిస్తున్నాడా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -