Monday, May 5, 2025
- Advertisement -

రామ్ చరణ్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగా

- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రం గుర్తుంది కదా. అందుకే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి దేశ్ ముఖ్ గా ఏ రేంజ్ లో అవుట్ పుట్ ఇచ్చాడో చూశాం. సినిమాను హీరో విజయ్ తో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎక్కడికో తీసుకుపోయాడు. పెట్టిన పెట్టుబడికి పదింతలు ఈ చిత్రం తీసుకురావడంతో మూవి ..ట్రెండ్ సెట్ గా మారిపోయింది. టోటల్ డైలగ్ సిస్టమ్ నే మార్చివేసిన చిత్రమిది. వాస్తవాలను చూపించేశారంతే.

అంతటి గొప్ప చిత్రాన్ని ఇచ్చిన సందీప్ రెడ్డి ఇపుడు చరణ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రెఢీ అవుతున్నాడు. ఇలా అవ్వడానికి కారణం… సినిమా చూసిన వెంటనే చెర్రీ సందీప్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించాడు. ఆ టైమ్లో ముందుగా కాల్ చేసిన హీరోల్లో చెర్రీ ఉండడంతో ఆ అభిమానం కూడా సందీప్ రెడ్డికి ఉంది.ఆ ఇదితోనే చెర్రీబాబుకోసం సరికొత్త జోనర్ తో ఓ కథ రెఢీ చేశాడు. ఇప్పటికే చ‌ర‌ణ్‌కి లైన్ కూడా వినిపించాడు. ఈ సినిమాని చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థలోనే తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నట్టు స‌మాచారం.

ఇటీవ‌ల చ‌ర‌ణ్ – సందీప్ ల మ‌ధ్య ఓ సిట్టింగ్ కూడా జరిగింది. అర్జున్ రెడ్డి త‌ర‌వాత సందీప్ చేసే సినిమా ఏమిట‌న్నది ఇంకా ఓ కొలిక్కి రానేలేదు. చ‌ర‌ణ్‌తో సినిమా కంటే ముందు ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నాడు సందీప్‌. చ‌ర‌ణ్ ప్రస్తుతం రంగ‌స్థలంతో బిజీ. ఆ త‌ర‌వాత బోయ‌పాటి శ్రీను సినిమా ఉంటుంది. రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ కూడా పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాతే.. సందీప్ సినిమా ప‌ట్టాలెక్కొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -