టాలీవుడ్ మొత్తన్ని షేక్ చేస్తున్న తాజా వివాదం కాస్టింగ్ కౌచ్ తార స్థాయికి చేరిందనే చెప్పాలి.నటి శ్రీరెడ్డి మొదలు పెట్టిన ఈ వివాదంలో తరువాత చాలా మంది బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి బహిరంగానే చెప్పారు.శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి తనుయుడు అభిరాం తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి తనను వాడుకొని వదిలేశాడని సంచలన ఆరోపణలు చేసింది.దగ్గుబాటి సురేశ్ కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తాను ముందుకు వచ్చానని అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆ సమయంలో తనకు నాలుగైదు కోట్లు సురేశ్ కుటుంబం నుంచి వచ్చేలా చేస్తానని కూడా విషయం చెప్పానన్నారు. ఆ సెటిల్‌మెంట్‌కు శ్రీరెడ్డి అంగీకరించలేదని అన్నారు.
సురేష్ బాబుకు ఈ విషయాలేవి తెలియవన్నారు. శ్రీరెడ్డి అంత డబ్బు నిరాకరించడం వెనక.. ఆమె చేస్తున్న ఉద్యమమే కారణమన్నారు. తను డబ్బులు తీసుకుంటే.. తన పోరాటానికి అర్థం ఉండదని.. తన ముఖం తాను చూసుకోలేనని శ్రీరెడ్డి తనతో చెప్పిందని వర్మ అన్నారు. అంత డబ్బు శ్రీరెడ్డి వద్దని చెప్పడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎన్నో కుటుంబాలకు లాభం చేకూర్చేందుకు చేస్తున్న పోరాటాన్ని తప్పుదోవ పట్టించలేనని శ్రీరెడ్డి చెప్పిందన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డికి మద్దతు పలికేవారు తక్కువ అయ్యారు.పవన్ కల్యాణ్‌పై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి ఇప్పుడు మద్దతు ఎ వవరు ఇవ్వడం లేదు.