అవును మీరు చదువున్నది నిజమే. పవన్‌కు పోటీగా రంగంలోకి దిగుతున్నారు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నటుడు,జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఒకటి గాజువాక కాగా రెండోది భీమవరం. ఈ రెండు చోట్లలో పవన్ ఎక్కడ గెలుస్తారో అని అందరు అతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. భీమవరంలో పవన్‌కు పోటీగా తాను కూడా పోటీ చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాను ఎన్నికల బరిలో ఉన్నానని, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు.
అయితే నామినేషన్ల గడువు ముగిసిన తరువాత కూడా తనకు ఉన్నతాధికారుల నుంచి పోటీ చేసేందుకు అనుమతిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. పూర్తి వివరాలు కోసం మరికొంత సమయం వేచి చూడండని చెప్పుకొచ్చాడు వర్మ. అయితే వర్మ ఏదో సరాదాగా ట్విట్ చేశాడని చర్చించుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ఎట్రాక్ట్ చేసి కాసేపు వార్తల్లో నిలిచేందుకే వర్మ ఇలా చేసినట్టు భావిస్తున్నారు.
- Advertisement -
భీమవరంలో పవన్‌కు పోటీగా రామ్ గోపాల్ వర్మ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -