సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీపెద్దలు, పవన్ అభిమానులు విరుచుకు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు? ఆ పదం ఉపయోగిస్తూ ఆయన్ను, ఆయన తల్లిని తిట్టడం ఏమిటి? అంటూ శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా వివాదాలకు కేంద్ర బిందువైన వర్మ స్పందించారు.
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టడం అనే విషయం సర్వ సాధారణమని, ప్రతి ఒక్కరూ తిట్లను ఉపయోగిస్తూనే ఉంటారని అన్నారు. ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్‌కి ఉన్న కొంత మంది అభిమానుల భాష చూస్తే తిట్లు తప్ప వారికి వేరే ఏమీ రావన్నట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు.
తాను అందరినీ అనట్లేదని, కొంత మంది పవన్ ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతుంటారని వర్మ అన్నారు. తాను, తన తల్లి, సోదరి కూడా ఆయనకు ఫ్యాన్సేనని, తాను పవన్‌ని సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉందని, శ్రీరెడ్డి తీసుకున్న నిర్ణయం, చేస్తోన్న పోరాటంతో ఇప్పుడు ఆ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు.
మాద*****త్ అనే పదం అర్థం తల్లిని తిట్టడం కాదు. అది ఒక ఇంగ్లిష్ వర్డ్ నుండి వచ్చింది. ఒక మగాడు తన అమ్మను కూడా ఇలా ఆలోచిస్తాడా అని మగాడిని తిట్టే తిట్టు. అది ఎలా తల్లికి వర్తింస్తుందో నాకు అర్థం కావడం లేదు…. అంటూ వర్మ వాదించారు
ఇప్పుడు ఈ విషయంపై అందరూ చర్చించుకునేలా ఆమె చేసిందని అన్నారు. సామాజిక కార్యకర్తలు సంధ్య, దేవిలాంటి వారు శ్రీరెడ్డి తరఫున పోరాడాలని, ఈ విషయంపై దృష్టిపెట్టి పోరాడాలని వర్మ పిలుపునిచ్చారు.