Monday, May 5, 2025
- Advertisement -

రీమేక్ సినిమాని రిజెక్ట్ చేసిన రామ్

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మధ్యనే అమెరికాకి వెకేషన్ కి వెళ్ళి తిరిగి ఇండియా కి ఈమధ్యనే వచ్చాడు. గత కొంతకాలంగా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. రామ్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ ఇప్పటికే చేజిక్కించుకున్నారు.

కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే తాజాగా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తర్వాత రామ్ తన నిర్ణయం మార్చుకున్నాడట. ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాడట. మరి స్రవంతి రవికిషోర్ సినిమాలో మరొక హీరోని పెట్టి నిర్మిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు రామ్ ప్రస్తుతానికి కొందరు దర్శకుల నుంచి కథలు వింటున్నాడు. తన తదుపరి సినిమా చేయడానికి కొంత సమయం తీసుకునే లానే ఉన్నాడు. పైగా ఈ మధ్యనే రామ్ గుండు కూడా చేయించుకున్నాడు కాబట్టి తన తదుపరి సినిమా మొదలు పెట్టడానికి ఇంకొంత సమయం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -