మాజీ సీఎం వైఎస్ఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వైఎస్ఆర్ పాత్రను మళయళ హీరో మమ్మూట్టి చేస్తున్నారు.వైఎస్ జగన్ పాత్రకు తమిళ సూపర్ స్టార్ సూర్యను సంప్రదించారని సమాచారం.వైఎస్ఆర్ జీవిత కథ అంటే దానిలో కేవిపి పాత్ర చాలా ముఖ్యం.ఎందుకంటే వైఎస్ఆర్‌కు మిత్రుడైన కేవిపిని సంప్రదించకుండ ఒక్క పని కూడా చేసేవారు కాదని తెలుస్తుంది.
దీంతో ఈ పాత్రకు చాలామందిని అనుకున్న ఎవరు సెట్ అవ్వలేదు. మొదట నటుడు ప్రకాష్ రాజ్ అనుకున్నారు. చిత్ర యూనిట్.కాని కేవిపి పాత్రకు చాలా రోజుల డేట్స్ కావలి.దాని వల్ల ప్రకాష్ రాజ్‌ను వద్దని అనుకున్నారు చిత్ర బృందం.ఫైనల్‌గా కేవిపి పాత్రకు నటుడు రావు రమేష్ని తీసుకున్నారు.రావు రమేష్ కూడా ఇప్పుడు అన్ని విధాలా సెటిల్డ్ గా చేస్తున్నాడు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావలి.