ఒక పక్క వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న హీరో, మరో పక్క వరుస హిట్లు కొడుతున్న హీరోయిన్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు హీరో అఖిల్, హీరోయిన్ రష్మిక. అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఇక ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వచ్చిన గీతా గోవిందం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే.
నానితో నటించిన దేవదాసు సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. తాజాగా అఖిల్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది రష్మిక. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజులు తరువాత మెగాఫోన్ పట్టబోతున్నాడు. మొదట ఈ సినిమాలో కియారా అద్వానీ పేరును పరిశీలించినప్పటికి రష్మిక వైపే మొగ్గు చూపారు దర్శక -నిర్మాతలు. యూత్‌లో రష్మికకు మంచి క్రేజ్ ఉంది. మరి అఖిల్‌కు రష్మిక అయిన హిట్ ఇస్తుందేమో చూడాలి.
- Advertisement -
రష్మిక అయిన అఖిల్‌కు హిట్ ఇస్తుందా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -