Tuesday, May 6, 2025
- Advertisement -

విడుదల తేదీ ముందే ప్రకటించాల్సిందే .. లేపోతే కష్టం !

- Advertisement -

ఏదైనా పెద్ద సినిమా విడుదల వస్తోంది అంటే దాంతో పాటు వచ్చే మిగితా సినిమాలకీ పెద్ద తలనొప్పిగా మారింది. ఏ సినిమా ఎప్పుడు విడుదల చెయ్యాలో తేదీలు ఇవ్వకపోతే చిన్న సినిమాలకి చాలా నష్టంగా మారింది. పైగా పెద్ద సినిమాల్ని ముందే ప్రకటించిన టైముకి రిలీజ్ చేయకుండా వాయిదాలు వేస్తూ ఇతర సినిమాలకు సంకెళ్లు వేయడం అనే వింతైన పరిస్థితి మనకు ఉంది.

భారీ బడ్జెట్ సినిమాల్ని పదే పదే వాయిదాలు వేస్తూ రిలీజ్ చేయడం వల్ల చిన్న నిర్మాతలంతా అయోమయంలో పడి కొట్టుకుపోవాల్సొస్తోంది. బాహుబలి – శ్రీమంతుడు – రుద్రమదేవి – అఖిల్  లాంటి సినిమాల విషయంలో ఇదే తలనొప్పి వచ్చింది. వీటి మధ్యలో చిన్న సినిమాకి – ఎగ్జిబిటర్లకు బోలెడంత నష్టం వాటిల్లింది.

అందుకే ఇప్పుడు నిర్మాతలమండలి – ఫిలింఛాంబర్ పెద్దలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇకనుంచి ఏదైనా పెద్ద సినిమా ముందుగా ప్రకటించిన తేదీకే రిలీజ్ కావాలి. అలా కాని పక్షంలో కనీసం మూడు నాలుగు వారాల గ్యాప్ తీసుకుని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ముందే స్ర్టీమ్ లైన్ లో ఉన్న చిన్న సినిమాలన్నీ ఆ గ్యాప్ లో రిలీజైపోతాయి.

జనవరి ఒకటి నుంచీ ఈ పద్ధతి మొదలెడతారు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు ఇక మీద విడుదల చేస్తే కుదరదు అంటున్నారు. కాలీవుడ్, బాలీవుడ్ లలో ఎప్పటినుంచో ఉన్న ఈ పద్ధతి ని ఇక్కడ కూడా అమలు చేసారు మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -