Sunday, May 4, 2025
- Advertisement -

అరెస్ట్‌లకు భయపడేది లేదు..!

- Advertisement -

తన గురించి పోలీసులు వెతుకుతున్నారన్న దానిపై ఘాటుగా స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ వీడియో రిలీజ్ చేసిన వర్మ..అరెస్ట్‌లతో తనను బయటపెట్టలేరని తేల్చిచెప్పారు. ఏడాది క్రితం పోస్ట్ చేసిన ట్వీట్లకు వారంలోనే నన్ను విచారించాల్సిన అవసరం ఏముందని…రాజకీయ నేతలు పోలీసులను ఆయుధాల్లా ఉపయోగిస్తున్నారా? వర్మ మార్క్ సెటైర్ వేశారు.

పోలీసుల నోటీసులకు ఇప్పటికే సమాధానం ఇచ్చానని…ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్న,షూటింగ్ నిలిచిపోతే నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రావడం లేదని తెలిపారు. ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట…. నేను పెట్టిన వారికి కాకుండా వేరేవాళ్ల మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఎదురు ప్రశ్నించారు ఆర్జీవీ.

సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ , నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..వ విచారణకు హాజరు కావాలని వర్మకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన విచారణకు హాజరుకాకపోవటంతో పోలీసులు ఆర్జీవీని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్, తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తుండగా వీడియో రిలీజ్ చేశారు వర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -