- Advertisement -
రామ్ గోపాల్ వర్మ…ఈ పేరు వింటేనే కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్. ఇక ఆర్జీవీ తీసే సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆర్జీవీ నుండి సినిమా వస్తుందంటేనే ఓ సెన్సేషన్. కేవలం సోషల్ మీడియా ద్వారానే తన సినిమాకు సంబంధించి అందరి అటెన్షన్ కొట్టేస్తాడు. అయితే ఆర్జీవీ ఇటీవల తీసిన సినిమాలన్నీ ఫ్లాపే. ఆయన నుండి హిట్ సినిమాలు చూసి కొన్ని సంవత్సరాలు అవుతోంది.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు వర్మ. ఇక నుండి మంచి సినిమాలే తీస్తానని వెల్లడించారు. సత్య సినిమా చూసి కన్నీళ్లు వచ్చాయి… రంగీల, సత్య సినిమాలు ఇచ్చిన విజయంతో నా కళ్లు మూసుకుపోయాయి.. దీంతో ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీసానన్నారు.
నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉందని…ఇకపై మంచి సినిమాలే తీస్తా అని మాటిస్తున్నా అన్నారు. మరీ ఆర్జీవీ తాను ఇచ్చిన ప్రామిస్‌ను నిలబెడతారో లేదో వేచిచూడాలి.