Monday, May 5, 2025
- Advertisement -

సల్మాన్ ని కొడితే రూ.2లక్షలు రివార్డు

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ను కొడితే 2 ల‌క్ష‌ల రూపాయిలు ఇస్తామ‌ని విశ్వహిందూ పరిషత్‌ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియాకు ప్ర‌క‌టించారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే…సల్మాన్ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.ఈ చిత్రం పేరు లవ్ రాత్రి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వివాదానికి కారణమైంది.హిందు మ‌తంలో న‌వ‌రాత్రిని పుణ్యంగా భావిస్తారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జ‌రుపుకుంటున్నారు.

అలాంటి న‌వ‌రాత్రిని ల‌వ‌రాత్రి పేరుతో అవ‌మాన‌ప‌రుస్తారా అని విశ్వహిందూ పరిషత్ మండిప‌డుతుంది. సల్మాన్‌ను ఎవరైనా బహిరంగంగా కొడితే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ లవ్ రాత్రి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకే ఇలాంటి టైటిల్‌ పెట్టారని పలువురు మండిపడుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -