Monday, May 5, 2025
- Advertisement -

తొలిప్రేమ ద‌ర్శ‌కుడితో మెగా మేన‌ల్లుడు

- Advertisement -

శంషాబాద్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం

మెగా మేన‌ల్లుడు మ‌ళ్లీ జ‌వాన్ సినిమాతో నిరాశ‌క‌ర ఫ‌లితం ఎదుర్కొన్నాడు. ఫ‌లితాన్ని ప‌ట్టించుకోకుండా సాయిధ‌ర‌మ్ తేజ మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు. వివి.వినాయక్ సినిమాను ఒప్పుకున్న తేజ్ దానిక‌న్నా ముందే ఓ సినిమా షూటింగ్ ప్రారంభించేశాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తొలిప్రేమ‌తో సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ రానున్నాడు. తేజ్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మంగ‌ళ‌వారం (డిసెంబ‌ర్ 12వ తేదీ) హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాట‌లు రాస్తున్నారు.

ప్రొడక్షన్ నంబర్ 45గా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఈ షూటింగ్ ప్రారంభ‌మైంది. క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాణంలో క్లాసికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరితో తెరకెక్కేలా ఈ సినిమా తీస్తున్నారు. ‘తొలిప్రేమ’ చిత్రంతో పవన్ కల్యాణ్‌కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎ.కరుణాకరన్‌ ఈ సినిమాతో సాయిధరమ్‌కు మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -