Monday, May 5, 2025
- Advertisement -

పక్కలోకి రమ్మని పిలవడం దారుణం

- Advertisement -

అవ‌కాశం కోసం ప‌డుకోవాడానికి ర‌మ్మ‌న‌డం చాలా దారుణం. ఈ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ ప‌దం బాగా వినిపిస్తంది. అదేనండీ సినిమాలో అవకాశాలు కోసం త‌మ‌తో గ‌డ‌ప‌ల‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు హీరోయిన్స్‌ని వేదించ‌టాన్ని కాస్టింగ్ కౌచ్ అని అంటారు ఈ మ‌ధ్య దీనికి ఆ పేరు పెట్టారు.హాలీవుడ్ ,బాలీవుడ్‌,టాలీవుడ్ ఇలా అన్ని ర‌కాల భాష‌ల‌లో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి బ‌హిరంగంగానే త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలియ‌జేస్త‌న్నారు హీరోయిన్స్.

ఇప్పుడు తాజాగా బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ గురించి స్స‌దించ‌టం విశేషం.ఇలాంటివి బాలీవుడ్ లో నేనెప్పుడూ వినలేదు. ఎవరైనా నా దగ్గరకొచ్చి ఇలాంటివి జరుగుతున్నాయని చెబితే, అలా అడిగిన వాళ్లను కడిగి పారేస్తాను” ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా సల్మాన్ ఖాన్. ఢిల్లీలో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో కాస్టింగ్ కౌచ్ పై ఇలా తన అభిప్రాయాల్ని వెల్లడించాడు సల్మాన్.

కొన్ని దశాబ్దాలుగా తను బాలీవుడ్ లో ఉంటున్నానని, తన తండ్రి నా కంటే ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉన్నారని.. తామిద్దరం ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినలేదని అంటున్నాడు సల్మాన్. ఒక రాత్రి గడిపితేనే అవకాశం ఇస్తామనే వాళ్లు బాలీవుడ్ లో లేరని అంటున్నాడు సల్మాన్.

సల్మాన్ పనిచేస్తున్న బాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఎన్నో గతంలో తెరపైకొచ్చాయి. వీటిలో కొన్ని రాజకీయ కోణం కూడా తీసుకున్నాయి. మరికొన్ని కోర్టు కేసుల వరకు వెళ్లాయి. మొన్నటికిమొన్న ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది. తన కెరీర్ స్టార్టింగ్ లో చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకుంది. ఇవన్నీ సల్మాన్ కు తెలియనవి కావు. కానీ అవేవీ తనవరకు రాలేదంటూ బుకాయిస్తున్నాడు ఈ కండలవీరుడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -