- Advertisement -
బాలీవుడ్ మూవీ కభీ ఈద్ కభీ దివాలీ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చారు సల్మాన్, పూజా హెగ్డే. వారికి టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు.
వీరితో పాటు వెంకటేష్ కూడా కలవడంతో ఇక సందడే సందడి. ఈ సందర్భంగా అతిథులకు చరణ్, ఉపాసన దంపతులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సల్మాన్, పూజా, వెంకీలతో కలిసి రామ్‌చరణ్, ఉపాసన ఫోటోలు దిగారు.

ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్నిరోజుల కిందటే సల్మాన్ ఖాన్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంటి ఆతిథ్యం ఇచ్చారు.