టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సమంత.2018లో ఆమెకు వరస హిట్లు వచ్చాయి.రంగస్థలం,అభిమాన్యుడు,అదిరింది,మహనటి సినిమాలతో హిట్లు కొట్టింది సమంత.అయితే తాజాగా సమంత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వినబడుతుంది.సమంత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. ప్రస్తుతం తెలుగులో యూటర్న్ రీమేక్, తమిళంలో సెమ్మ రాజా, సూపర్ డీలక్స్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. వీటితోపాటు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ ఆమె నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందని సమాచారం.అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.కొందరు సమంత గర్భవతి అయిందని అందుకే సినిమాలకు గుడ్ బై చెబుతుందని కొందరి అభిప్రాయపడుతున్నారు.అయితే సమంత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతుందా లేక కొంత కాలం గ్యాప్ తీసుకుని మళ్లీ నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.సమంత నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.