దక్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు. తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తు టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత కూడా వరుస సినిమాలలో నటిస్తు ఫుల్ బిజీగా మారింది. తాజాగా సమంత నటించిన తమిళ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘సూపర్ డీలక్స్’ అనే సినిమాలో సమంత లీడ్ రోల్లో నటిస్తోంది. ట్రైలర్ మొదలు నుంచి చివరి వరకు ఆకట్టుకుంది. ట్రైలర్‌లో కథేంటో అర్థం కాలేదు కానీ,దాన్ని ఒక పిట్ట కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర దర్శకుడు.
సినిమా కథను పిట్ట కథ రూపంలో తెలియజేయానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటించాడు. ఆడవేషంలో విజయ్ సేతుపతి ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సిపిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత కొత్త సినిమా టీజర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -