హీరోయిన్ పెళ్లి తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో సమంతకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక పెళ్లి తరువాత భర్త నాగచైతన్యతో ఆమె కలిసి నటిస్తున్న చిత్రం మజిలి. టీజర్, ట్రైలర్, పాటలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో వీరిద్దరు సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ ప్రేమ పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.
మా ప్రేమ పెళ్లిగా మారడానికి 8 సంవత్సరాలు పట్టిందని తెలిపింది.చైతుని ముందు తనే ఇష్టపడినట్లు చెప్పింది. ఓ గొడవ కారణంగా చైతన్యకు కొంతకాలం దూరంగా ఉన్నానని, మళ్లీ కలవడానికి చాలా సమయమే పట్టిందని తెలిపింది. అయితే ఆ గొడవ ఏంటనేది మాత్రం బయటికి చెప్పలేదు. పెళ్లి తరువాత కోపం తగ్గించుకున్నానని, ఎప్పుడైనా చైతుకి తనకు గొడవ జరిగితే పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది. తనకు బిడ్డ పుడితే కొన్నేళ్లు అన్నింటికి దూరంగా ఉంటానని స్పష్టం చేసింది.
- Advertisement -
ఆ విషయంలో నాగచైతన్యకు నాకు పెద్ద గొడవ జరిగింది – సమంత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -