అర్జున్ రెడ్డి తెలుగు సినిమా స్థితి గతిని మార్చేసిన సినిమా. నాగర్జున నటించిన శివ తరువాత మళ్లీ తెలుగు సినిమాలలో ట్రెండ్ సెట్ సినిమా అంటే అర్జున్ రెడ్డే అని చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహించాడు.గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డికి చాలానే అవకాశాలు వచ్చాయి. ఆ మధ్య మహేశ్ బాబుకి ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నాడనే వార్తలు వచ్చాయి.
కాని మహేశ్‌తో సినిమా చేయలంటే మినిమమ్ ఒక సంవత్సరం అయిన వెయిట్ చేయాలి. అప్పటికి అయిన సినిమా చేస్తాడా అంటే అనుమానమే.దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు సందీప్. ఎన్టీఆర్‌ను కలిసి ఓ కథను వినిపించాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే సందీప్‌తో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. అటు సందీప్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ రీమేక్ చేస్తున్నాడు. ఈలోపు ఈ సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ కోసం రెడీ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మరో అర్జున్ రెడ్డిని ఊహించుకుంటున్నారు అభిమానులు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’