ఒకప్పడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారంతా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోవడం కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య అలాంటి వెటరన్ బ్యూటీలకు కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. దాంతో కొంతమంది ముద్దుగుమ్మలు మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే నదియా, రమ్యకృష్ణ వంటి వాళ్లు తమ ఏజ్ కు తగ్గ పాత్రలతో మెప్పిస్తుండటంతో.. తాజాగా మరో సీనియనర్ నటి సంఘవి కూడా ఈ జాబితాలోకి వచ్చేసింది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంఘవి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతోందట.
అయితే అనుకున్నదే ఆలస్యం అన్నట్టు అప్పుడే అమ్మడికి కోలీవుడ్ లో ఓ అవకాశం కూడా వచ్చిందట. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న నయా మూవీలో సంఘవి మెయిన్ రోల్ పోషించబోతోందట. అంతేకాదు టాలీవుడ్ లోనూ ఇలాంటి ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సంఘవి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.