షకీలా.. మలయాళ శృంగార భరిత చిత్రాలతో ఒక టైంలో ఓ ఊపు ఊపింది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె జీవితం అనుకోని పరిస్థితిలో పడింది. సినిమాలు లేక అర్ధిక ఇబ్బందులు పడి.. ఎంత సతమతమైంది. తాజాగా ‘ఆలీతో సరదాగా..’ కార్యక్రమంలో పాల్గొని తన పరిస్థితిపై మరింత ఓపెన్ అయింది షకీలా. జీవితంలో తనకంటూ ఒక తోడు లేకుండా పోయిందని షకీలా తెలిపింది.
తన జీవితంలో 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. కానీ చివరికి వాళ్లల్లో ఎవ్వరూ తనతో నిలవలేదని షకీలా చెప్పడం విశేషం. తానకు ఎవరైన బాగా నచ్చితే.. వెంటనే ఇంప్రెస్ అయ్యి.. మరుసటి రోజుకే ప్రేమలో పడిపోయేదాన్నని.. ఈ లెక్కన తన జీవితంలో 20 ప్రేమకథలున్నాయని షకీలా తెలిపింది. కానీ వారు ఎవరు తనతో ఎక్కువ కాలం ఉండలేదని చెప్పింది. ఒకరు తన తల్లిని దూరం పెట్టమని అడగడంతో.. ఇంకొకరు అన్నయ్యకు సాయం చేయొద్దని చెప్పడంతో.. ఇంకొకరు తన మీద అజమాయిషీ చేయడంతో.. ఇలా ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో దూరం పెట్టానని షకీలా తెలిపింది. తనతో ఉన్నవాళ్లలో కొందరు తనను శారీరకంగా చాలా హింసించారని చెప్పింది.
ఒక వ్యక్తి తనను తాగి విపరీతంగా తిట్టేవాడు.. కొట్టేవాడని.. అయితే చాలా వరకు భరించానని.. కానీ ఒకరోజు మరీ ఎక్కువ కొట్టాడని.. దీంతో తాను హ్యాంగర్ తీసుకుని అతణ్ని చితకబాదానని.. అందులో మేకులున్న సంగతి కూడా చూడలేదని.. అలాగే చీరేసి.. ఒక కాల్ ట్యాక్సీ పిలిపించి అందులో తన ఇంటికి పంపించానని షకీలా వెల్లడించింది. చివరగా ఒక వ్యక్తితో ఏడేళ్ల పాటు కలిసున్నానని.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నామని.. కానీ వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది షకీలా.