Tuesday, May 6, 2025
- Advertisement -

షో టైమ్ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -

యవ్వనంలో ఉండగా హీరో అవుదామనుకున్నాను. అలాగే ప్రయత్నించాను కూడా. మా అన్నయ్య కాంచీ వచ్చి భవిష్యత్ లో ఏమవుతావురా అని అడిగితే హీరో అని చెప్పా. కాని చిత్రంగా దర్శకుడిని అయ్యాను అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి.

రణధీర్, రుక్ సర్ మీర్ జంటగా ఎస్.ఎస్.కాంచీ దర్శకుడిగా రూపొందిన చిత్రం షో టైమ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.  కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ ఎవరైనా అనుకున్నది సాధించాలంటే పట్టుదల ఒక్కటే కాదని, ఆ పరిశ్రమలో ఎన్నాళ్లైనా ఉండాలని తన అన్నయ్య కాంచి చెప్పారని రాజమౌళి చెప్పారు. నిజానికి తన అన్నయ్య కాంచి ఎప్పుడో దర్శకుడు కావాలని, కాని ఇప్పుడు అవకాశం వచ్చిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తన విజయాల్లో కీరవాణి, రాజమౌళి తండ్రుల పాత్ర ఎంతో ఉందని, ఇప్పుడు వారి కుమారులను చూస్తూంటే తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

ఈ సినిమాతో దర‌్శకుడిగా పరిచయం అవుతున్న కాంచీ కూడా భవిష్యత్ లో మంచి దర‌్శకుడిగా పేరు తెచ్చుకుంటారని ఆయన అన్నారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్ధాయికి తీసుకువెళ్లాలన్నదే తన లక్ష్యమని, అందుకే విదేశీ సంస్ధతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించానని చిత్ర నిర్మాత సుధీర్ పూదోట అన్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -